మీ–సేవకు వెళ్లకుండా బర్త్ సర్టిఫికెట్‌.. ఇలా చేయండి | How To Apply For Birth Certificate Online In Hyderabad Using Mobile Step By Step Guide, Read Full Story For Details | Sakshi
Sakshi News home page

మీ–సేవకు వెళ్లకుండా మొబైల్‌ నుంచే అప్లయ్‌

Oct 13 2026 4:35 PM | Updated on Oct 13 2026 4:58 PM

how to apply birth certificate online Hyderabad in Mobile

అరచేతి నుంచే దరఖాస్తు.. బర్త్ సర్టిఫికెట్‌ ఇక సులువు

జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో సదుపాయం 

గ్రేటర్ హైద‌రాబాద్‌ ప్రజలు తమ పిల్లల బర్త్ సర్టిఫికెట్ల కోసం మీసేవా కేంద్రాల ద్వారా కాకుండా నేరుగా స్వయంగా తమ మొబైల్‌ లేదా కంప్యూటర్‌ నుంచే దరఖాస్తు చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. బర్త్ సర్టిఫికెట్ల కోసం ఇటీవలి కాలం వరకు వినియోగించిన అప్లికేషన్‌ స్థానే, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వినియోగిస్తున్న సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (సీఆర్‌ఎస్‌) అందుబాటులోకి రావడంతో సదరు వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు నని అధికారులు తెలిపారు. అందుకుగాను ఏంచేయాలో, అధికారులు తెలిపిన వివరాల మేరకు..

⇒ వెబ్‌ బ్రౌజర్‌లో అధికారిక  సీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌  https://crsorgi.gov.in  తెరవాలి.

⇒ లాగిన్‌ దగ్గర జనరల్‌ పబ్లిక్‌ సైన్‌అప్‌ ఎంపికపై క్లిక్‌ చేసి మొబైల్‌ నెంబర్‌/ ఈమెయిల్‌ వివరాలు నమోదు చేయాలి.  

⇒ వాటికి వచ్చే లాగిన్‌ వివరాలతో పోర్టల్‌లోకి వెళ్లి జనన తేదీ, ప్రదేశం, తదితర అడిగిన వివరాలు నమోదు చేయాలి. క్యాప్చా వంటివి సరిగ్గా నమోదు చేయాలి.

⇒ జననం జరిగిన ప్రాంతం జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలలో ఏ కార్పొరేషన్‌ పరిధిలోకి వస్తే సంబంధిత లోకల్‌ రిజిస్ట్రార్‌ను ఎంచుకోవాలి. ఆసు పత్రి రిపోర్టు, గుర్తింపు ఆధా రాలు, తదితర అడిగిన  పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి.  

⇒ దరఖాస్తు సమర్పించిన తర్వాత వచ్చే రిఫరెన్స్‌ నెంబర్‌ను భద్రపరచుకోవాలి. తద్వారా దరఖాస్తు స్టేటస్‌ తెలుసుకోవచ్చు.  

⇒ డెత్‌ సర్టిఫికెట్లు పొందేందుకు కూడా ఇదే విధానం అవలంబించాలి.

ఇదీ చ‌ద‌వండి: తండ్రి ఏసీపీ.. కొడుకు డీఎస్పీ

రిజిస్ట్రార్‌ ఆమోదం తర్వాత సర్టిఫికెట్‌ను సీఆర్‌ఎస్‌ పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దాదాపు వారం రోజుల్లో సర్టిఫికెట్‌ అందే అవకాశమున్నప్పటికీ, ఆస్పత్రులు శిశువుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు 21 రోజుల గడువుంది. అంతకంటే ఆలస్యమైతే వాటికి ఆలస్యమైన రోజుల ఆధారంగా ఆలస్య ఫీజు విధిస్తారు. ఈ విధానం కొత్త అయినందున సాంకేతిక ఇబ్బందులు తలెత్తొచ్చు. 
- సాక్షి, సిటీబ్యూరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement