
కరీంనగర్ జిల్లాలో విషాదం
కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
హుజూరాబాద్:
కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని హుజూరాబాద్ మండలం కందుగులలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామంలోని గంగిరెడ్డి కాలనీకి చెందిన గంట కొమరయ్య(36), కొమరమ్మ(34) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి అత్తారింటికి వెళ్లిన సందర్భంలో మంత్రాలు చేస్తున్నారని నింద వేయడంతో మనస్తాపానికి గురై ఇంటికి తిరిగొచ్చి తన ముగ్గురు పిల్లలు ఎల్లమ్మ(10), కొమరవ్వ(8), అంజమ్మ(6)లకు ఉరి వేసి అనంతరం దంపతులు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.