23 మంది జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్ | families of 23 journalists, pension | Sakshi
Sakshi News home page

23 మంది జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్

Dec 1 2014 1:56 AM | Updated on Apr 3 2019 7:53 PM

రాష్ట్రంలో వ్యాధులతో పాటు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 23 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం పెన్షన్.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాధులతో పాటు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 23 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఎన్.శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్‌అలీలు ఆదివారం తెలిపారు.

పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతి పత్రాన్ని సమర్పించామని, దానికి  స్పందించి ఆయన పెన్షన్ మంజూరు చేస్తు  ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. అంతేకాకుండా 8మంది జర్నలిస్టుల చికిత్సకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని  ముఖ్యమంత్రి  సహాయ నిధి నుంచి కేటాయించిందని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement