శివరాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పేలుడు | Explosion Near Shivarampally Railway Station In Ranga Reddy | Sakshi
Sakshi News home page

శివరాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పేలుడు

Mar 14 2020 10:47 AM | Updated on Mar 14 2020 10:48 AM

Explosion Near Shivarampally Railway Station In Ranga Reddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి : శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లలోని ఫర్నీచర్‌, ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. రైల్వే సమీపంలో ఉన్న కాటేదాన్‌ వడ్డెర బస్తీలోని చెత్తకుప్పలో ఈ పేలుగు సంభవించింది. పేలుడు శబ్దం విని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఏదైనా రసాయన పదార్థం వల్ల పేలుడు సంభవించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణ నష్టం ఏమి జరగలేదని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement