వరాహాల నగర్..! | excursion pigs in Shantinagar | Sakshi
Sakshi News home page

వరాహాల నగర్..!

Nov 11 2014 2:25 AM | Updated on Sep 2 2017 4:12 PM

వరాహాల నగర్..!

వరాహాల నగర్..!

పట్టణంలోని శాంతినగర్‌లో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. చెత్తకుప్పలు, డ్రెయినేజీల వద్ద గుంపులుగుంపులుగా....

శాంతినగర్‌లో పందుల సైర్వవిహారం
పొంచి ఉన్న వ్యాధులు
చోద్యం చూస్తున్న మున్సిపల్ యంత్రాంగం

 
నల్లగొండ టౌన్ పట్టణంలోని శాంతినగర్‌లో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి.  చెత్తకుప్పలు, డ్రెయినేజీల వద్ద గుంపులుగుంపులుగా తిరుగుతూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాయి. ఈ కా రణంగా దోమల వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది కేవ లం లిటిల్ ఫ్లవర్ కాలేజీ ప్రధాన రోడ్డు వెంట మాత్రమే శుభ్రం చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మురుగు కాల్వల నిర్వహణ ను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.వెరసి ఆయా ప్రాంతా లు అపరిశుభ్రంగా మారి పందులకు ఆవాసాలుగా మారుతున్నా యని ఆవేదన చెందుతున్నారు. ఒక్క శాంతినగర్‌లోనే సుమారు 500 పందులు ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు.

జానావాసాల్లో పందుల పెంపకం చేపట్టరాదనే నిబంధనలు ఉన్నాయి. ఒక వేళ ఎవరైనా పెంచినా మున్సిపల్ అధికారులు వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పె ద్ద సంఖ్యలో పందులు స్వైర విహారం చేస్తున్నా అధికారులు నిమ్మ కు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. పెంపకందారుల నుంచి మున్సిపల్ సిబ్బంది మామూళ్లు తీసుకుంటూ పందులను అరికట్టడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించాలని శాంతినగర్‌వాసులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement