మద్యం షాపుపై ఎక్సైజ్ దాడులు | Excise raid wine shop | Sakshi
Sakshi News home page

మద్యం షాపుపై ఎక్సైజ్ దాడులు

Dec 20 2015 4:48 PM | Updated on Sep 5 2018 8:43 PM

కల్తీ మద్యం విక్రయం ఆరోపణలతో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని వైన్‌షాపుపై ఎక్సైజ్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు.

జైపూర్ (ఆదిలాబాద్) : కల్తీ మద్యం విక్రయం ఆరోపణలతో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని వైన్‌షాపుపై ఎక్సైజ్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు సిబ్బందితో కలసి శ్రీ వినాయక వైన్స్ షాపులో తనిఖీలు నిర్వహించారు. మద్యం లూజ్‌గా విక్రయిస్తుండడంతో దానిని సీజ్ చేశారు. ల్యాబ్‌కు పంపించి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement