అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించా! | Everyone be happy to praying | Sakshi
Sakshi News home page

అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించా!

May 24 2015 7:22 PM | Updated on Sep 3 2017 2:37 AM

ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థించానని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు.

తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
తిరుమల: ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థించానని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదివారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మంత్రి ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు.

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతియేటా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని, ఇందులో భాగంగానే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలసి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement