సీఎం ఫెక్ల్సీకి.. పెనాల్టీ! | EVDM Challan to Khairathabad ZC Hyderabad | Sakshi
Sakshi News home page

ఫెక్ల్సీ.. పెనాల్టీ!

Feb 18 2020 8:12 AM | Updated on Feb 18 2020 8:12 AM

EVDM Challan to Khairathabad ZC Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సీఎం బర్త్‌డే సందర్భంగా మొక్కలు నాటుదాం అంటూ పిలుపునిస్తూ ఫెక్ల్సీ ఏర్పాటు చేసినందుకు ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌(జెడ్‌సీ) ప్రావీణ్యకు సోమవారం జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం రూ.10 వేలు ఈ–చలానా జారీ చేసింది. గోల్కొండ కోట సమీపంలో సీఎం ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉల్లంఘనలకు పాల్పడ్డారని పేర్కొంటూ చలాన్‌లు జారీ చేశారు. దీనిపై కమిషనర్‌తో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని ప్రావీణ్య తెలిపారు. ఈ విషయంపై కమిషనర్‌ను సంప్రదించగా, బ్యానర్లు క్లాత్‌వా, ఫ్లెక్సీలా అనేది పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము క్లాత్‌వి  ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచించామన్నారు. ఒకవేళ ఫ్లెక్సీలైతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా గోల్కొండ కోట వద్ద ఇలాంటి ప్రచారం ఫెక్ల్సీలు ఏంటని ఓ సంస్థ ట్విట్టర్‌లో ఫిర్యాదు చేయడం వల్లే చలానా విధించారని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement