12% వృద్ధిరేటుకు అంగీకరించలేదు: ఈటల | etela rajender speak on GST council | Sakshi
Sakshi News home page

12% వృద్ధిరేటుకు అంగీకరించలేదు: ఈటల

Sep 24 2016 3:12 AM | Updated on Sep 4 2017 2:40 PM

12% వృద్ధిరేటుకు అంగీకరించలేదు: ఈటల

12% వృద్ధిరేటుకు అంగీకరించలేదు: ఈటల

జీఎస్టీ అమలులో 12 % వృద్ధి రేటును సరాసరిగా తీసుకోవాలన్న నిర్ణయానికి తెలంగాణ తరఫున అంగీకారం తెలపలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

‘జీఎస్టీ’పై ఆర్థిక మంత్రి ఈటల
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులో 12 % వృద్ధి రేటును సరాసరిగా తీసుకోవాలన్న నిర్ణయానికి తెలంగాణ తరఫున అంగీకారం తెలపలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జీఎస్టీ మండలి తొలి సమావేశం ముగిసింది. విధివిధానాలకు తుది రూపునిచ్చేందుకు ఈనెల 30న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

పన్ను లాభనష్టాల విషయంలో 2015-16 బేస్ ఇయర్‌గా నిర్ణయించారు. తెలంగాణకు 2016-17ను బేస్ ఇయర్‌గా నిర్ణయించాలని కోరగా అందుకు అంగీకరించారు. రూ. 1.5 కోట్ల టర్నోవర్ లోపు ఉన్న వ్యాపారులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంచాలని నిర్ణయించారు’ అని  పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement