మంత్రాల నెపంతో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మంత్రి ఈటల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
కుటుంబం ఆత్మహత్యపై మంత్రి దిగ్ర్భాంతి
Jul 10 2017 1:06 PM | Updated on Sep 5 2017 3:42 PM
కరీంనగర్: మంత్రాల నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి కారుకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు.
Advertisement
Advertisement