రాజకీయాల కన్నా తనకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే ముఖ్యమని రాష్ట్ర టీఎన్జీవోల సంఘం చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు.
సిద్దిపేట టౌన్ : రాజకీయాల కన్నా తనకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే ముఖ్యమని రాష్ట్ర టీఎన్జీవోల సంఘం చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. సిద్దిపేట ఎన్జీఓ భవన్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో తనకు టిక్కెటు ఇవ్వని అంశాన్ని రాజకీయ దురుద్దేశంతో వాడుకోవడం తగదన్నారు.
ఉద్యోగుల విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చే యాలన్నారు. స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసినప్పుడే తెలంగాణలో పాలన వేగవంతమవుతుందన్నా రు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలన్నారు. జిల్లా, జోన్ స్థాయి అధికారులను వారి ప్రాంతాలకు పంపిం చాలన్నారు. దసరా లోగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు.
ప్రభుత్వం ఉద్యోగులకు హెల్త్ కార్డులను, పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని కోరారు. బంగారు తెలంగాణలో తాము సైతం భాగస్వామ్యం అవుతామన్నారు. సమావేశంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ప్రధా న కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నేతలు విక్ర మ్, శ్రీహరి, మజీద్ పాల్గొన్నారు.