అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు | elder brother attacked younger one | Sakshi
Sakshi News home page

అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు

Mar 20 2015 12:02 AM | Updated on Sep 5 2018 2:12 PM

ఇంట్లో మేకలు పెంచడం వల్ల దుర్వాసన వస్తుంది...

గోల్నాక: ఇంట్లో మేకలు పెంచడం వల్ల దుర్వాసన వస్తుంది... వాటిని బయట కట్టేయాలని చెప్పిన అన్నను కత్తితో దాడి చేసి గాయపర్చిన సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ పి.వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... అంబర్‌పేట ఆకాష్‌నగర్‌లో అర్షద్‌సయీద్, ఇఫ్తికర్ సయీద్, ఇంతియాజ్ సయీద్ అనే ముగ్గురు అన్నదమ్ములు ఒకటే ఇంట్లో నివాసముంటున్నారు. ఇఫ్తికర్ ఇంట్లో మేకలను పెంచుతున్నాడు.

మేకలు పెంచడంతో దుర్వాసన వస్తోంది బయట కట్టేయాలని చాలా రోజులుగా అర్షద్ తన తమ్ముడు ఇఫ్తికర్‌కు చెబుతున్నాడు. గురువారం కూడా మరోసారి ఇదే విషయమై అన్న వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇఫ్తికర్ ఇంట్లోకి వెళ్లి గడ్డికోసే కత్తిని తీసుకొచ్చి అర్షద్‌పై దాడి చేశాడు. దీంతో అతని చేతికి గాయాలయ్యాయి. వెంటనే అతను అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement