పరీక్షలు లేకుండానే పాస్‌! | Education Department Making Arrangements Of Promoting Students Without Exams | Sakshi
Sakshi News home page

పరీక్షలు లేకుండానే పాస్‌!

Mar 27 2020 1:34 AM | Updated on Mar 27 2020 1:38 AM

Education Department Making Arrangements Of Promoting Students Without Exams - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో 9వ తరగతి వరకున్న విద్యార్థులకు ఈసారి పరీక్షలు నిర్వహించకుండానే పాస్‌ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కోవిడ్‌ విజృంభన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది. అయితే కేంద్రం వచ్చే నెల 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఇక పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏప్రిల్‌ 7 నుంచి ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14 వరకు ప్రకటించింది. మరోవైపు ఈ విద్యా సంవత్సరం ఈ నెల 23తో ముగియనుంది. దీంతో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. కోవిడ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ మరో వారం పొడిగిస్తే కనుక అసలు సాధ్యమే కాదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను పైతరగతికి ప్రమోట్‌ చేయాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. 9వ తరగతి వరకు విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాస్‌ చేసేలా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement