వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఐనవోలులో దారుణం జరిగింది. ఓ మూగ యువతిపై ...దుండగులు సామూహిక ...
వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఐనవోలులో దారుణం జరిగింది. ఓ మూగ యువతిపై ...దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గురువారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన యువతిపై దుండగులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వర్ధన్నపేట సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు వరంగల్ జిల్లా ఎస్పీ కూడా తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా ఘటనా స్థలంలో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, అనుమానితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.