breaking news
Inavolu
-
ప్రేమించిన అమ్మాయితో పెళ్లి.. ఆర్నెళ్లకే మనస్పర్థలు రావడంతో
సాక్షి, వరంగల్: ప్రేమించుకున్న వారిద్దరినీ వివాహ బంధం ఒక్కటి చేసింది. ఆతర్వాత మనస్పర్థలు విడాకులకు దారి తీశాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకున్నాడు. ఎస్సై గుగులోతు వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామానికి చెందిన కట్కూరి రజినీకాంత్(29) గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రజినీకాంత్ కూలీ పనులు, బ్యాండ్ వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2017లో శివనగర్‌కు చెందిన యువతితో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహమైన ఆర్నెళ్లకే భార్య, భర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్య పుట్టింటికి వెళ్లింది. గొడవలు తీవ్రతరం కావడంతో 2021లో విడాకులు పొందారు. ప్రేమించిన అమ్మాయి దూరమవడంతో రజినీ కాంత్ మనస్తాపానికి గురై తాగుడుకు బానిసయ్యాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: మైనర్‌పై లైంగిక దాడి, జైలుకెళ్లి వచ్చాక పెళ్లి.. భార్యపై అనుమానంతో ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
చీలిపోనున్న ధర్మసాగర్ మండలం
ధర్మసాగర్ : రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజనలో భాగంగా ధర్మసాగర్ మండలం రెండుగా చీలిపోనుంది. మండలంలోని వేలేరు నూతన మండలంగా ఏర్పాటు కానుంది. గతంలో 24 గ్రామాలతో ఉన్న ధర్మసాగర్, మండలంలోని ఉనికిచర్ల, రాంపూర్ గ్రామాలు గతంలోనే గ్రేటర్ వరంగల్‌లో విలీనమయ్యాయి. ప్రస్తుతం 22 గ్రామాలతో ఉన్న ధర్మసాగర్ మండలంలోని కరీంనగర్ జిల్లా సరిహద్దుగా ఉన్న వేలేరు గ్రామ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకానుంది. ధర్మసాగర్ మండలంలోని ఏడు గ్రామాలు, కరీంనగర్ జిల్లాలోని ఎనిమిది గ్రామాలను కలిపి 15 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటు చేస్తారు. కాగా, గ్రేటర్లో విలీనమైన రాంపూర్ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటుచేయనున్న కాజీపేట మండలంలో కలపనున్నట్లు సమాచారం. ధర్మసాగర్ మండలంలోని మిగులనున్న గ్రామాలు ధర్మసాగర్, దేవునూరు, ధర్మపురం, ఎలుకుర్తి, జానకిపురం, క్యాతంపల్లి, మద్దెలగూడెం, మల్లక్‌పల్లి, ముప్పారం, నారాయణగిరి, పెద్దపెండ్యాల, రాయిగూడెం, సాయిపేట, సోమదేవరపల్లి, తాటికాయల. వేలేరు మండలంలోని గ్రామాలు వేలేరు, పీచర, గుండ్లసాగర్, సోడాషపల్లి, మల్లికుదుర్ల, శా లపల్లి, కమ్మరిపేట, కరీంనగర్ జిల్లా నుంచి కలిసే గ్రా మాలు కొత్తకొండ, మల్లారం, కన్నారం, కట్కూర్, ఎర్రబెల్లి, ముస్తఫాపూర్, చాపగానితండా, ధర్మారం గ్రామాలు. రెండు మండలాలుగా స్టేషన్‌ఘన్‌పూర్ స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న మండలాల ఏర్పాటులో జిల్లాలోనే అతిపెద్ద మండలాల్లో ఒకటైన స్టేషన్ ఘన్పూర్ రెండుగా చీలిపోనుంది. మండల పరిధిలో మొత్తం 28 గ్రా మాలు ఉండగా, మల్కాపూర్, చిల్పూరు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నట్లుగా అధికారులు పుణ్యక్షేత్రం ఉన్న చిల్పూరును మండల కేంద్రంగా ఏర్పాటుచేయనున్నారు. స్టేషన్ ఘన్పూర్మండలంలో 18 గ్రామాలు, చిల్పూరు మండలంలో 10 గ్రామాలు ఉండే అవకాశం ఉంది. వీటితో పాటుగా పక్కన ఉన్న మండలాల నుండి ఒకటి రెండు గ్రామాలు కలిసే అవకాశం ఉంది. చిల్పూరు మండలంలోని గ్రామాలు ఇవే.. చిల్పూరు, రాజవరం, పల్లగుట్ట, కృష్ణాజీగూడెం, ఫతేపూర్, మల్కాపూర్, వెంకటాద్రిపేట, లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మిగులనున్న గ్రామాలు.. స్టేషన్‌ఘన్‌పూర్, చిన్నపెండ్యాల, నష్కల్, వంగాలపల్లి, ఛాగల్, రాఘవాపూర్, శివునిపల్లి, విశ్వనాథపురం, తానేదార్పల్లి, ఇప్పగూడెం, కోమటిగూడెం, పాంనూర్, నమిలి గొండ, సముద్రాల, మీదికొండ, కొత్తపల్లి, తాటికొండ, దేశాయితండా గ్రామాలు ఉండనున్నాయి. 12 గ్రామాలతో ఐనవోలు మండలం వర్ధన్నపేట : జిల్లా పునర్విభజనలో భాగంగా ఐనవోలు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు 12 గ్రామాలతో ఐనవోలును మండలం ఏర్పాటు చేయడానికి రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ప్రతిపానదనలు సిద్ధం చేస్తున్నారు. నూతనంగా ఆవిర్భవిస్తున్న ఐనవోలు మండలంలోని గ్రామాల వివరాలిలా ఉన్నాయి. ఐనవోలు, ఒంటిమామిడిపెల్లి, సింగారం, పున్నేలు, పెరుమాండ్లగూడెం, కక్కిరాల పెల్లి, నందనం, ఉడుతగూడెం, రెడ్డిపాలెం, పంథినితో పాటు జఫర్గడ్ మండలంలోని వెంకటాపూర్, గర్మిళ్లపెల్లి గ్రామాలతో నూతన మండలం ఏర్పాటుకానుంది. వర్ధన్నపేటలో.. విభజన తర్వాత వర్ధన్నపేట, డీసీతండా, ల్యాబర్తి, కొత్తపెల్లి, దమ్మన్నపేట, బండౌతపురం, ఇల్లంద, కట్రా్యల, ఉప్పరపెల్లి, నల్లబెల్లి, రాంధాన్తండా, చెన్నారం గ్రామాలు వర్ధన్నపేట మండలంలో కొనసాగుతాయి. మండలంలోని రామవరం, దివిపెటిపెల్లిని జఫర్‌గఢ్ మండలంలో విలీనం చేసి, జఫర్‌గఢ్‌లోని వెంకటాపూర్ గర్మిళ్లపల్లి గ్రామాలను ఐనవోలులో అంతర్భాగం చేయడానికి అధికారులు ప్రతిపాదనలు చేశారు. -
రాజధాని బురద
-
మూగ యువతిపై సామూహిక అత్యాచారం
వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఐనవోలులో దారుణం జరిగింది. ఓ మూగ యువతిపై ...దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గురువారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన యువతిపై దుండగులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వర్ధన్నపేట సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు వరంగల్ జిల్లా ఎస్పీ కూడా తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా ఘటనా స్థలంలో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, అనుమానితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.