డ్రైవర్ ఆత్మహత్యాయత్నం | driver attempted to commit suicide | Sakshi
Sakshi News home page

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

May 8 2015 1:57 AM | Updated on Sep 29 2018 5:26 PM

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం - Sakshi

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

సమ్మెచేస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సికింద్రాబాద్ జేబీఎస్ ప్రాంగణంలోని కంటోన్మెంట్ డిపో ...

హైదరాబాద్: సమ్మెచేస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సికింద్రాబాద్ జేబీఎస్ ప్రాంగణంలోని కంటోన్మెంట్ డిపో ఎదుట ఓ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే పోలీసులు అతన్ని సమయానికి కాపాడారు. కంటోన్మెంట్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రభుదాస్ (45) రెండురోజులుగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్నాడు.

సమ్మె రెండో రోజైన గురువారం కూడా ప్రభుత్వం స్పందించడంలేదనే మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా.. ఇదే డిపోలో తాత్కాలికంగా కండెక్టర్‌గా చేరిన రవీందర్‌పై డిపో ఉద్యోగులు కొందరు గురువారం దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement