తల్లిదండ్రులను విస్మరించొద్దు

Do Not Ignore Parents - Sakshi

ఎమ్మెల్యే కూసుకుంట్ల  ప్రభాకర్‌రెడ్డి

చౌటుప్పల్‌లో క్యాన్సర్‌ సేవాకేంద్రం ప్రారంభం

హాజరైన ఆరోగ్యశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, కలెక్టర్‌

చౌటుప్పల్‌ (మునుగోడు) నల్గోండ : డబ్బుపై ప్రేమతో మ రణానికి చివరిదశలో ఉన్న తల్లిదండ్రులను విస్మరించొద్దని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన ప్యాలియేటీవ్‌ (క్యాన్సర్‌)సేవాకేంద్రాన్ని ఆరోగ్య శాఖ కమిషనర్‌ వా కాటి కరుణ, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌లతో క లిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. సేవా కేంద్రంలో సేవలు పొందుతున్న వ్యక్తులతో మా ట్లాడారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వయస్సు పైబ డి మరణ దశలోని వ్యక్తులకు ఎన్నో బాధలు ఉం టాయన్నారు. వారిని చూసుకోవాల్సి న బాధ్యత వారి సంతానంపైనే ఉందన్నారు. డబ్బున్న వ్యక్తుల్లోనే తల్లిదండ్రులను విస్మరించే సంస్కృతి ఎక్కువగా ఉందన్నారు. ఫ్లోరైడ్‌ ప్రాంతమైన ఇక్కడ ప్యాలియేటీవ్‌ కేంద్రం ఏర్పాటుకు కలెక్టర్‌ అందించిన సహకారం మరువలేనిదన్నా రు. 

ఏడాదిలోపు 30జిల్లాల్లో ఏర్పాటు.. 

ఆరోగ్యశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ మాట్లాడుతూ ప్యాలియేటీవ్‌ సేవా కేంద్రాలు ఇప్పటి వరకు విదేశాల్లోనే ఉన్నాయన్నారు. మనదేశంలో మొదటగా కేరళలో నడుస్తున్నాయని తెలిపారు. వీటిని ఏర్పాటు చేసిన రెండో రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని అన్నారు. ప్రస్తుతం మన రా ష్ట్రంలోని చేవెళ్ల, మహబూబ్‌నగర్, గజ్వేల్, చౌటుప్పల్‌ ఆస్పత్రుల్లో సేవా కేంద్రాలు ప్రారంభమవ్వగా వరంగల్, ఖమ్మం, జనగామ, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ప్రారంభం కావాల్సి ఉందన్నారు.

వైద్యపరంగా జిల్లాకు కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. పాలియేటీవ్‌ సేవల్లో యాదాద్రి జిల్లాను దేశంలోనే మొదటిస్థానంలో నిలిపేలా తమవంతు సహకారం అందిస్తామని అన్నారు. టాటా, వీసీ ట్రస్ట్‌ల సహకారంతో సేవా కేంద్రంతో పాటు గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి సేవలు అందిస్తామన్నారు. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ మాట్లాడుతూ క్యాన్సర్, ఇతర ప్రమాదకర వ్యాధులు వచ్చినప్పుడు సంభవించే బాధ వర్ణనాతీతమన్నారు.

అలాంటి సమయాల్లో కుటుంబ సభ్యులు సదరు వ్యక్తులను పట్టించుకోని పరిస్థితులు ఎదురవుతాయన్నారు. గౌరవ ప్రధమైన మరణం పొందేం దుకు పాలియేటీవ్‌ సెంటర్‌ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యురాలు గాయత్రి, టాటా ట్రస్ట్‌ సభ్యులు జగన్నాథం, గుణ, జిల్లా వైద్యాధికారి సాంభశివరావు, ఆర్డీఓ సాల్వేరు సూరజ్‌కుమార్, ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, డీసీహెచ్‌ కోట్యానాయక్, తహసీల్దార్‌ షేక్‌ అహ్మద్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు,  ఉపసర్పంచ్‌ పాక పద్మ, వైద్యులు వీరన్న, పాండురంగం, టీఆర్‌ఎస్‌ నాయకులు, పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top