జిల్లాలోని తొగుట మండలం పెద్దమాసాన్పల్లిలో బుధవారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
మెదక్: జిల్లాలోని తొగుట మండలం పెద్దమాసాన్పల్లిలో బుధవారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తాము నివాసించే ప్రాంతంలో రసాయన పరిశ్రమను స్థాపించొద్దంటూ వారు ధర్నాకు దిగారు. రసాయన పరిశ్రమ నిర్మాణం విషయమై వచ్చిన జాయింట్ కలెక్టర్ను గ్రామస్తులు నిర్భంధించినట్టు సమాచారం.
రంగంలోకి దిగిన పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. దాంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. గ్రామస్తుల ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నట్టు సమాచారం.