ఇలాంటి రాక్షసుల కోసమా.. పహారా కాసింది?

Disha Father Sridhar Reddy Comments About Daughter Death  - Sakshi

దిశ తండ్రి, మాజీ సైనికుడు శ్రీధర్‌రెడ్డి ఆవేదన

దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశా

సాక్షి, హైదరాబాద్‌ : దేశం నీకు ఏమిచ్చిందన్నది కాదు.. దేశానికి నువ్వు ఏమిచ్చావు అన్నది ముఖ్యం అంటారు పెద్దలు. సైన్యంలో పనిచేసి దేశానికి సేవలందించే వీర జవానుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఒకవేళ దేశ సేవలో అసువులుబాసితే అతని త్యాగానికి సెల్యూట్‌ చేస్తాం. అమరుడంటూ కీర్తిస్తాం. దిశ తండ్రి కూడా ఓ వీరసైనికుడే. కానీ ఆయనకు నలుగురు కీచకులు మిగిల్చిందేమిటి? తన గారాలపట్టి, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని అన్యాయంగా చిదిమేశారు. పైశాచికత్వంగా తెగబడి ప్రాణాలు తీసి కాల్చేశారు. 

నా గుండె బరువు ఎన్నటికీ దిగదు... 
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తరువాత ‘సాక్షి’ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డిని పరామర్శించింది. నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించడాన్ని ఆయన స్వాగతించారు. పోలీసుల పనితీరును అభినందిస్తున్నానని, వారికి కృత జ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేను దేశంపై ప్రేమతో 1981 లో సైన్యంలో చేరా. అహ్మద్‌నగర్‌లో శిక్షణ తర్వాత అంబాలాలో పోస్టింగ్‌ ఇచ్చారు. తరువాత పంజాబ్‌లోని కపుడ్తలాలో పోస్టింగ్‌. అదే సమయంలో ‘ఆపరేషన్‌ బ్లూస్టార్‌’కూడా జరిగింది.

అప్పుడు పంజాబ్‌లో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఆపరేషన్‌ మొదలైందని మాకు సందేశం అందింది. పలు రెజిమెంట్ల నుంచి వెళ్లాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. సిద్ధంగా ఉండాలని, రిజర్వు ఫోర్సు గా తరువాత వెళ్లాల్సింది మా యూనిట్‌ సభ్యులేనని ఆదేశాలు వచ్చాయి. నాతోటి వారితో సహా సిద్ధంగా ఉన్నాం. మేము ఆ ఆపరేషన్‌లో నేరుగా పాల్గొనలేదు కానీ రిజర్వు ఫోర్సు కిం ద పని చేశాం. సైన్యంలో ఆరేళ్లపాటు సేవలందించా. ఏ సైనికుడూ ప్రాణాల కోసం ఎప్పుడూ బాధపడడు. నేను కూడా ఎప్పుడూ భయపడలేదు. గుండెనిండా ధైర్యం కలవాడిని. కా నీ నేడు నా గుండె కూడా బరువెక్కింది. ఎన్ని చేసినా ఆ గుండె బరువు దిగదు’’అని అన్నారు. 

కీచకులకు త్వరగా శిక్షలు పడాలి.. 
‘‘మాలాంటి సైనికులు సరిహద్దులో కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెడతారు. మేం అందరి కోసం పాటుపడతాం. మాకు కుల, మత, ప్రాంతీయ భేదాలు ఉండవు. కానీ మాలాంటి సైనికుల గుండెలు కూడా బరువెక్కేలా చేస్తున్న ఇలాం టి పిశాచాలు దేశంలో స్వేచ్ఛగా తిరుతుండ టం బాధాకరం. ఇలాంటి వారి కోసమా మే ము ప్రాణాలు పణంగా పెట్టి పని చేసింది? అన్న ఆలోచన మమ్మల్ని మరింత బాధకు గురిచేస్తోంది.

అందుకే ఇలాంటి రాక్షసులకు త్వర గా శిక్షలు పడేలా ప్రస్తుతమున్న చట్టాలను స వరించాలి. కొత్త చట్టాలు తీసుకురావాలి. నిర్భ య కేసులో ఏడేళ్లు గడిచినా నేటికీ దోషులకు శిక్ష పడలేదు. యూపీలోని ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని నిందితులు బెయిల్‌పై వచ్చి మరీ చంపడం అత్యంత హేయం. అం దుకే ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని చట్టపరంగా, శీఘ్రంగా శిక్షించేలా చట్టాలను బలోపేతం చేయాలి’’అని దిశ తండ్రి ప్రభుత్వాలను కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top