ఆలయాలకు పోటెత్తిన భక్తులు | devotees rush in yadagiri gutta | Sakshi
Sakshi News home page

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Dec 25 2015 3:24 PM | Updated on Sep 3 2017 2:34 PM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది.

యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా నాలుగు రోజులు సెలవులు కావడంతో యాదాద్రి లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అదే విధంగా వేముల వాడ రాజరాజేశ్వరి ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
 
భద్రాచలం
ఇక భద్రాచలం వెళ్లే దారులన్ని భక్త జన కోలహలంతో నిండిపోయాయి. భద్రాచలంలోని రాముల వారి ఉచిత దర్శనానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం సాయంత్రం స్వామివారిని రాపత్తు ఉత్సవంలో భాగంగా గోవింద మండపంపై వూరేగిస్తారు. ఈ ఊరేగింపు చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement