తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు | Daughter Did Funeral To Her Father | Sakshi
Sakshi News home page

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

Jul 2 2019 8:12 AM | Updated on Jul 2 2019 8:13 AM

Daughter Did Funeral To Her Father - Sakshi

సాక్షి, వేములవాడ : కంటికి రెప్పలా కాపాడే కన్న తండ్రిని విధి గుండె సంబంధిత వ్యాధి రూపంలో బలి తీసుకుంది. పుట్టెడు దుఃఖంతో తండ్రికి చిన్నకూతురు తలకొరివి పెట్టింది. ఈ హృదయ విదారకర ఘటనతో గ్రామస్తులు కంటతడిపెట్టారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చందుర్తి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి బాబు ఆర్నెళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు చేసి గుండె వీక్‌గా ఉందని చెప్పారు.

కూలీ పని చేస్తేనే పూటగడిచే ఆ కుటుంబానికి వైద్యం చేయించుకునేందుకు చేతిలో చిల్లి గవ్వ లేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం బాబు అస్వస్థతకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కూతుళ్లు స్రవంతి, స్యౌమ ఉన్నారు. పెద్ద కూతురు స్రవంతికి వివాహం కాగా, చిన్న కూతరు సౌమ్య పుట్టెడు దుఃఖంతో తండ్రి చితికి నిప్పు పెట్టింది. కాగా నిరుపేద కుటుంబానికి గ్రామస్తులు రూ.30 వేలు, రెండు క్వింటాళ్ల బియ్యం విరాళంగా అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా కృషి చేసి ఆదుకుంటామని ఎంపీటీసీ సభ్యుడు పులి రేణుకాసత్యం హామీ ఇచ్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement