తల్లిని చంపి పూడ్చిపెట్టారు! | daughter and son murdered mother | Sakshi
Sakshi News home page

తల్లిని చంపి పూడ్చిపెట్టారు!

Mar 10 2015 5:32 PM | Updated on Sep 2 2018 4:37 PM

తల్లిని చంపి పూడ్చిపెట్టారు! - Sakshi

తల్లిని చంపి పూడ్చిపెట్టారు!

ఆస్తి కోసం కన్నతల్లినే హతమార్చిన దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది

ఆస్తిపై వ్యామోహంతో కొడుకు, కూతురు కలిసి కన్న తల్లినే కడతేర్చిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది గోష్ మహల్ లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన తాజాగా బయటపడింది.
 

లక్ష్మీబాయి తన కొడుకు ఖదిర్ అలియాస్ బాబు, కూతురు కిరణ్మయిలతో కలిసి గోషామహల్‌లో నివాసముండేది. అయితే లక్ష్మీబాయి తన భర్త చనిపోవడంతో కొద్ది కాలం పిల్లలతో కలిసి ఒంటిరిగా జీవనం సాగించింది. తరువాత కాలంలో లక్ష్మీబాయికి జలీల్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త రెండో వివాహానికి దారితీసింది. జలీల్‌ను వివాహం చేసుకున్న తరువాత కుటుంబంలో కలతలు చెలరేగాయి.  గోషామహల్‌లో వారు నివాసముంటున్న ఇంటిని తన పేరుమీద రాయాల్సిందిగా బాబు తల్లిపై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలోనే గతేడాది జనవరిలో తల్లిని హత్య చేశాడు. దీనిపై అప్పట్లో కేసు నమోదుచేసుకున్న పోలీసులకు కన్న కూతురు, కొడుకు కలిసి తల్లిని హత్యచేశారని నిర్థారించారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement