అంధకారంలో చిన్నశంకరంపేట | Darkness in chinnashankarampeta | Sakshi
Sakshi News home page

అంధకారంలో చిన్నశంకరంపేట

Aug 6 2015 11:38 PM | Updated on Sep 18 2018 8:38 PM

సమాచారం లేకుండా రోజంతా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చిన్నశంకరంపేట మండలంలో గురువారం అంధకారం

 చిన్నశంకరంపేట : సమాచారం లేకుండా రోజంతా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చిన్నశంకరంపేట మండలంలో గురువారం అంధకారం నెలకొంది. మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో రాత్రి 9 గంటల వరకు కూడా కరెంట్ సరఫరా కాలేదు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు బ్యాంకుల్లో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. పలు పరిశ్రమల్లో పనులు స్తంభించాయి. మీర్జాపల్లి రైల్వేస్టేషన్‌లో ఆన్‌లైన్ వ్యవస్థ పనిచేయలేదు. మరోవైపు సిగ్నలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాన్స్‌కో ఏఈ అహ్మద్‌అలీ దీనిపై మాట్లాడుతూ టి.మాందాపూర్ వద్ద రోడ్డు నుండి గ్రామంలోకి వచ్చే విద్యుత్ వైర్లను సరిచేసేందుకు సరఫరా నిలిపివేసినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement