
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.144 శాతం డీఏ పెరగనుంది. పెరిగిన డీఏ 2018 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా 27.248 శాతం నుంచి 30.392 శాతానికి డీఏ పెరిగింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది.