గిరిజనుల శవాలపై పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తారా? | D Srinivas opposed polavaram bill | Sakshi
Sakshi News home page

గిరిజనుల శవాలపై పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తారా?

Jul 11 2014 7:31 PM | Updated on Aug 21 2018 8:34 PM

గిరిజనుల శవాలపై పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తారా? - Sakshi

గిరిజనుల శవాలపై పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తారా?

పోలవరం బిల్లును ఆఘమేఘాలపై ఎలా ఆమోదిస్తారని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత డి. శ్రీనివాస్ ప్రశ్నించారు.

న్యూఢిల్లీ: పోలవరం బిల్లును ఆఘమేఘాలపై ఎలా ఆమోదిస్తారని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత డి. శ్రీనివాస్ ప్రశ్నించారు. సంబంధిత రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండానే బిల్లును లోక్సభలో ఆమోదించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గిరిజనుల శవాలపై పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఇష్టం లేకున్నా కొన్ని గ్రామాలను పునర్ విభజన చట్టంలో చేర్చామని వెల్లడించారు.

తెలంగాణ ప్రజల హక్కుల్ని కాలరాసేలా వ్యవహరిస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ లో వ్యాఖ్యానించారు. పోలవరం బిల్లు ఆమోదించడంపై ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement