సిలిండర్ల లారీ బోల్తా | cylinder Lorry roll | Sakshi
Sakshi News home page

సిలిండర్ల లారీ బోల్తా

Apr 2 2015 9:03 AM | Updated on Sep 2 2017 11:45 PM

సిలిండర్ల లారీ బోల్తా

సిలిండర్ల లారీ బోల్తా

ఖాళీ సిలిండర్లతో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న లారీ ఒకటి ప్రమాదవశాత్తూ గురువారం ఉదయం 7 గంటలకు బోల్తా పడింది.

మహబూబ్‌నగర్(మానవపాడు): ఖాళీ సిలిండర్లతో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న లారీ ఒకటి ప్రమాదవశాత్తూ గురువారం ఉదయం 7 గంటలకు బోల్తా పడింది. ఈ ప్రమాదం మహబూబ్ నగర్ జిల్లా మానవపాడు మండలం ఉండవెల్లి శివారులో జరిగింది. సిలిండర్లు రహదారిపై చెల్లాచెదురగా పడి ఉన్నాయి. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. లారీలో ఖాళీ సిలిండర్లు మాత్రమే ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. జాతీయ రహదారి సిబ్బంది పట్టించుకోకపోవడంతో 44వ జాతీయ రహదారిపై సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

Advertisement
 
Advertisement
Advertisement