సాగు సగమే! | Cultivation half! | Sakshi
Sakshi News home page

సాగు సగమే!

Nov 13 2014 4:10 AM | Updated on Oct 1 2018 2:03 PM

సాగు సగమే! - Sakshi

సాగు సగమే!

రబీలో సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 2.09 లక్షలు కాగా గతేడాది 2.56లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి.

సాగు వివరాలు (హెక్టార్లలో)
 
 పంట               సాధారణం        గతేడాది             ప్రస్తుతం
 వరి                51,486               82,055            30
 వేరుశనగ        98,603            1,26,671            72,142
 శనగ            26,293            33,058            23,880
 జొన్న            10,290                8,450                3,123
 పొద్దుతిరుగుడు      6,457              2,143            98
 మొక్కజొన్న             4,113              4,199            820
 రాగి                          226                  108            65
 ఇతర పంటలు     9,315               285            596
 
 మహబూబ్‌నగర్ వ్యవసాయం : రబీలో సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 2.09 లక్షలు కాగా గతేడాది 2.56లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది రబీలో ఇప్పటివరకు కేవలం లక్ష హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు వేశారు. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, జొన్న, రాగి, కంది లాంటి పంటలను సాగు చేసుకోవాలని అధికారులు సూచి స్తున్నా రైతులు మాత్రం అందుకు వి ముఖత చూపిస్తున్నారు. గతేడాది అక్టోబర్, నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో సగానికిపైగా చెరువు లు నిండాయి. అదేవిధంగా ప్రాజెక్ట్‌ల లో నీటి నిల్వలు పెరిగాయి.

దీంతో సాధారణ సాగుతో పోల్చితే గతేడాది వరి పంట సాగు 30వేల హెక్టార్లలో పెరిగింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో ఆ పరిస్థితి తలకిందులైంది. సా ధారణ సాగుకంటే ఈ ఏడాది తక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వే స్తున్నారు. సాధారణ సాగు విస్తీర్ణం 51 వేల హెక్టార్లు కాగా ఈ ఏడాది 35వేల హెక్టార్లు కూడా సాగయ్యే పరిస్థితి లేకపోవచ్చని అధికారుల అంచనా. అదేవిధంగా రబీలో వేరుశనగ పంట సాధారణ సాగు 98వేల హెక్టార్లు కాగా గతేడాది 1.26లక్షల హెక్టార్లలో సాగైంది.

కాగా ప్రస్తుతం 72,142 హెక్టార్లలో మా త్రమే వేరుశనగ పంట సాగైంది. ఈ ఏడాది  85వేల హెక్టార్లలకు కూడా పెరి గే అవకాశం లేకుండా పోయింది. అలా గే శనగ పంట సాధారణ సాగు 26వేల హెక్టార్లు కాగా గతేడాది 33వేల హెక్టార్ల లో సాగైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 23వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఈ పంట ఇంకా  పెరిగే అవకాశాలు చా లా తక్కువగా ఉన్నాయి.

 వర్షాలు లేకే ఈ పరిస్థితి
 జిల్లా సాధారణ వర్షపాతం 604.6మిల్లీమీటర్లు. అయితే ఈ ఏడాది జూన్ నుండి ఇప్పటి వరకు 547.4మీ.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 466.9 మి.మీ మాత్రమే కు రిసింది. 11 మండల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురవగా 23 మండల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. 28 మండల్లాలో తక్కువ వర్షపాతం, మరో రెండు మండల్లాలో మరీ తక్కువ వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement