'గుణాదిగూడ కాలువ వెంటనే పూర్తి చేయాలి' | CPM Party protest at Bhuvanagiri MRO Office | Sakshi
Sakshi News home page

'గుణాదిగూడ కాలువ వెంటనే పూర్తి చేయాలి'

Feb 23 2016 3:36 PM | Updated on Aug 13 2018 8:10 PM

వ్యవసాయ సాగుకు ఎంతో ఉపయోగపడే నల్గొండ జిల్లా భువనగరి మండలంలోని గుణాదిగూడ కాలువ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని తక్షణమే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది.

నల్గొండ : వ్యవసాయ సాగుకు ఎంతో ఉపయోగపడే నల్గొండ జిల్లా భువనగరి మండలంలోని గుణాదిగూడ కాలువ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని తక్షణమే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. మంగళవారం భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఎం పార్టీ నేతలు, కార్యకర్తలు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో పార్టీ నేత నంద్యాల నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ దీక్షకు స్థానిక కాంగ్రెస్పార్టీ నేత కుంభం అనిల్కుమార్రెడ్డి మద్దతు పలికారు. ఈ దీక్షలో సీపీఎం కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement