మసకబారుతున్న ఎర్రకోట 

CPI Losing Power In Bellampalli - Sakshi

ఉనికిని కోల్పోతున్న సీపీఐ 

తగ్గుతున్న పార్టీ ప్రాభవం 

బెల్లంపల్లి: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)కి కంచుకోటగా ఉన్న బెల్లంపల్లిలో క్రమంగా ఎర్రజెండా మసక పారుతోంది.రాజకీయ, కార్మికోద్యమాలను నిర్మించి ప్రజల్లో పట్టు సాధించిన సీపీఐ ఎన్నికల్లో ఓటమి పాలై ఉనికిని కోల్పోతోంది. ఏ ఎన్నికలు జరిగిన సరిగ్గా సత్తా చాటుకోలేక చతికిల పడుతోంది. ఒకప్పుడు స్వతంత్రంగా ఎన్నిక ల్లో పోటీ చేసి ఇతర పక్షాలకు గట్టి పోటీ ఇవ్వడంలో, అనేక మార్లు విజయం సాధించడంలో ఆరితేరిన సీపీఐ కొన్నాళ్ల నుంచి‘ పొత్తు’ లతో పోటీ  చేయడానికి పరిమతమవుతోంది. ఆ తీరు గా ఎన్నికల్లో పోటీ చేసినా కూడా చివరికి ఏవేవో కారణాలతో ఓడి పోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పరిణామాలు వామపక్ష భావజాలం కలిగి న శ్రేణులకు తీవ్ర నిరాశ కలిగిస్తుండగా  చట్టసభ ల్లో ప్రజావాణిని వినిపించలేక పోతున్నారు. కార్మిక, కర్షక, యువజన, విద్యార్థి, మహిళలు, పీడిత, తాడిత, అట్టడుగువర్గాల పక్షాన సమరశీల పోరాటాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే కమ్యూనిస్టులు ఎన్నికల సమరంలో మాత్రం బలాన్ని  ని రూపించుకోలేక పోతున్నారు.   

సన్నగిల్లుతున్న పార్టీ నిర్మాణం 
బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ నిర్మాణం కొంతకాలం నుంచి తగ్గుతోంది. మండలాలు, శాఖల వారీగా బలహీన పడుతున్నారు. సీపీఐలో కొత్త రక్తం వచ్చి చేరడంలేదు. పార్టీలో యువజన, విద్యార్థులు, మహిళల చేరికలు జరగడంలేదు. నియోజకవర్గంలోని బెల్లంపల్లి, తాండూర్‌ మండలాల్లో కాస్తా నిర్మాణం కలిగి ఉండగా కాసిపేట, భీమిని, వేమనపల్లి, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో నిర్మాణాత్మకంగా లేక ఎన్నికల సమరంలో వెనుకబడుతున్నారు. ఇతరులపై ఆధారపడి పోటీ చేస్తుండటం అలవాటుగా మా రిందనే విమర్శలు ఉన్నాయి.

అనాది నుంచి వసు ్తన్న సీపీఐ శ్రేణులే తప్పా కొత్తతరాన్నీ ఆకర్శించలేకపోతున్నారనే అసంతృప్తి, ఆవేదన ఆ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. కాస్తో , కూస్తో సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) మాత్రమే  కార్మికవర్గంలో పట్టు కలిగిఉన్నట్లు స్పష్టమవుతోంది. సొంతబలం లేక పోవడంతో ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయలేని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీపీఐకి ఇ న్నాళ్లుగా కొంత  ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ మారి న రాజకీయ పరిణామాల నేపధ్యంలో క్రమంగా ఆ ఓట్లు కూడా తగ్గుతూ వస్తున్నాయి. 

అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడి.. 
బెల్లంపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా పోటీ చేసే అవకాశం సీపీఐకే దక్కింది. ఈదఫా ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌ పక్షాలు కలిసికట్టుగా మహా కూటమి పేరుతో ఎన్నికల పో రులో నిలిచాయి, టీఆర్‌ఎస్‌ ఓటమే ప్రధాన ల క్ష్యంగా సంయుక్తంగా పోటీ చేసిన మహా కూటమి పొత్తులో భాగంగా బెల్లంపల్లి అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి వదిలేసింది. చివరి వరకు కాంగ్రెస్‌ శ్రేణు లు గట్టి పట్టుపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి సీపీఐకి సీటు కేటాయించడంతో కూటమి ఉమ్మడి  అభ్యర్థిగా సీపీఐ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు గుండా మల్లేశ్‌ పోటీలో నిలబడ్డారు.

ఎన్నికల పోరులో ఇతర ప్రత్యర్థులకు సరిసమానంగా ప్రచారం చేయకపోవడం, ఓటర్లను ప్రస న్నం చేసుకోవడంలో విఫలం కావడం, మరీ ముఖ్యంగా ఇతర పక్షాల ఓట్లు కంకి కొడవలి గుర్తుకు బదలాయింపు జరగకపోవడంతో గుండా మల్లేశ్‌ ఘోర పరాజయాన్ని చవిచూశారు. కనీసం  డిపాజిట్‌ కూడా రాలేక పోయింది. కేవలం 3,905 ఓ ట్లు సాధించి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి ఆసిఫాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి నియోజకవర్గంలో కూ డా సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తూ వస్తోంది. 1978 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు సీపీఐ పోటీ చేసి నాలుగు దఫాలు విజయం సా ధించింది.ఇన్నిసార్లు కూడా సీపీఐ పక్షాన గుండా మల్లేశ్‌ పోటీ చేయడం గమనార్హం. ఏది ఏమైనా ఎన్నికల పోరులో సీపీఐ సరిగా రాణించలేక  ప్రాభవం కోల్పోతోందనే అభిప్రాయాలు కమ్యూ నిస్టు శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top