
‘బూర్జువా పార్టీలకు ప్రజలే బాహుబలి’
తెలంగాణ సీఎం కేసీఆర్ కు అహంభావం పెరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.
బూర్జువా పార్టీలకు ప్రజలే బాహుబలి అని వ్యాఖ్యానించారు. రాజధానిలో ప్రజల గొంతు నొక్కుతున్నారన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పునరేకీకరణ జరగాలన్నారు. 2019 నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా తయారవుతామని చెప్పారు. ప్రజల సమస్యలపై ఈనెల 27న కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నట్లు వివరించారు. కమ్యూనిస్టులకు సిద్ధాంతాలపై కేసీఆర్ పాఠాలు అవసరం లేదన్నారు.