చిన్నారి సహా దంపతుల ఆత్మహత్య! | couple suicide along with child in rangareddy district | Sakshi
Sakshi News home page

చిన్నారి సహా దంపతుల ఆత్మహత్య!

Oct 14 2014 8:40 AM | Updated on Jul 10 2019 7:55 PM

ఘట్‌కేసర్ మండలం కొండాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కొండాపూర్‌కు సమీపంలోని

హైదరాబాద్ : ఘట్‌కేసర్ మండలం కొండాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కొండాపూర్‌కు సమీపంలోని రైలు కిందపడి చిన్నారి సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు. కాగా దంపతులు మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement