దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందనీ. ప్రధాని మోడీ ఇరవై దేశాలు తిరిగి పెట్టుబడులను ....
వినాయక్‌నగర్ (నిజామాబాద్) : దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందనీ. ప్రధాని మోడీ ఇరవై దేశాలు తిరిగి పెట్టుబడులను ఆహ్వానించినా మన దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు కనడబడం లేదని సీపీఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో మూడు రోజు లపాటు జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సేకరణ చట్టాన్ని సవరించి ఏదో సాధిస్తానని అనుకున్న ప్రధానికి కార్మిక సంఘాలు దీటుగా సమాధానం చెప్పాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి దశ, దిశ లేద ని, వ్యూహత్మకమైన ప్రణాళిక లేదన్నారు. దేశంలో హేతువాదుల్ని, అభ్యుదయ భావాలున్న వారిని ప్రణాళిక ప్రకారం హత్యలు చేస్తున్నారని ఆరోపించారు.