
పలు చోట్ల అభ్యర్థులు సమయానికి రాకపోవడంతో వారి అనుమతికి అధికారులు నిరాకరించారు.
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ పరీక్ష ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 966 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రాథమిక పరీక్ష జరగనుంది. పరీక్షా సమయాల్లో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ను అమలు చేశారు. పలుచోట్ల కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
మొత్తం 17,156 ఉద్యోగాలకు 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. బయోమెట్రిక్‌తో అభ్యర్థుల వేటిముద్రలు, ఫోట్రోగ్రాఫ్‌లు తీసుకుంటున్నారు. ముందే ప్రకటించిన విధంగా పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరాణలకు అనుమతి నిరాకరిస్తున్నారు. పలు చోట్ల అభ్యర్థులు సమయానికి రాకపోవడంతో వారి అనుమతికి అధికారులు నిరాకరించారు.