సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు దగ్గర పడుతున్నా మహాకూటమిలో సీట్ల పంపీణీ కొలిక్కి రావటం లేదు. సీట్ల పంపిణీ చర్చలకు మాత్రమే పరిమితమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక పలు సీట్లపై పీడముడి నెలకొంది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ సమావేశంలో నేతల మధ్య వాడివేడీ వాదనలు నడుస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్గాల నుంచి వేరు వేరుగా అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో ప్రతిష్టంభన ఏర్పడింది.
టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అభ్యర్థులతో, తొలినుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అభ్యర్థులకు మధ్య పోటీ నెలకొంది. పారాచూట్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వద్దంటూ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతున్నారు. పోటాపోటీ ప్రతిపాదనలతో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరికి మించి అభ్యర్థుల పేర్లు వినపడుతున్నాయి.
| నియోజకవర్గం | అభ్యర్థుల పేర్లు |
| ఎల్లారెడ్డి | పైలా కృష్ణారెడ్డి, సుభాష్ రెడ్డి, నల్ల మడుగు సురేందర్ |
| బాల్కొండ | అనిల్, రాజారామ్ యాదవ్ , అన్నపూర్ణమ్మ |
| నిజామాబాద్ రూరల్ | వెంకటేశ్వర రావు, భూపతి రెడ్డి |
| నిజామాబాద్ అర్బన్ | మహేష్ గౌడ్, అరికెల నర్సారెడ్డి |
| మంచిర్యాల | ప్రేమ్ సాగర్ రావు , అరవింద్ రెడ్డి |
| సూర్యాపేట | పటేల్ రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి |
| ఇల్లందు | హరిప్రియ, ఊకె అబ్బయ్య |
| దేవరకొండ | బిల్యానాయక్, జగన్ |
| ధర్మపురి | దరువు ఎల్లన్న, లక్ష్మణ్ కుమార్ |
| మెదక్ | విజయశాంతి, శశిధర్ రెడ్డి |
| పెద్దపల్లి | వీర్ల కొమరయ్య, విజయ రమణారావు, సురేష్ రెడ్డి , సవితా రెడ్డి |
| ఇబ్రహీంపట్నం | మల్రెడ్డి రంగారెడ్డి , క్యామ మల్లేష్ |


