వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం | Congress party power in the next election | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం

Nov 21 2017 8:55 AM | Updated on Mar 18 2019 7:55 PM

చండూరు : వచ్చే ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలోకి వస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్‌ నేత అన్నారు. సోమవారం చండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన హా మీలు అమలు చేయకుండా నియంతలా పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఇంటికో ఉద్యోగం.. దళితులకు మూడు ఎకరాలు అంటూ దగాచేశారని మం డిపడ్డారు. కనీసం రైతాంగ సమస్యలు కూడా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు పున్న ధర్మేందర్, ఎస్సీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కురుపాటి గణేష్, ఎండీజున్ను, దేవా, నాగారాజు, రోహిత్‌ పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement