సీనియర్లకు 'సభ్యత్వ నమోదు' అప్పగించాలి: వీహెచ్ | Congress party MP VH not happy on party membership program | Sakshi
Sakshi News home page

సీనియర్లకు 'సభ్యత్వ నమోదు' అప్పగించాలి: వీహెచ్

Nov 23 2014 1:04 PM | Updated on Mar 18 2019 7:55 PM

సీనియర్లకు 'సభ్యత్వ నమోదు' అప్పగించాలి: వీహెచ్ - Sakshi

సీనియర్లకు 'సభ్యత్వ నమోదు' అప్పగించాలి: వీహెచ్

తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) ఆదివారం హైదరాబాద్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సికింద్రాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) ఆదివారం హైదరాబాద్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోని సీనియర్లకు కూడా ఈ పార్టీ సభ్యత్వ నమోదు బాధ్యత అప్పగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పార్టీ సమావేశాలకు దూరంగా ఉండటం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సీనియర్లంతా పాల్గొనాలని వీహెచ్ సూచించారు. ఆదివారం సికింద్రాబాద్ లోని ఇంపీరియర్ గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి భారీగా నాయకులు తరలివచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement