కాంగ్రెస్‌ ‘ఎమ్మెల్సీ’ ఎంపిక కమిటీ ఏర్పాటు

Congress MLC set up a select committee - Sakshi

తొమ్మిది మంది సీనియర్‌ ఎమ్మెల్యేలతో కమిటీ

నేడు భేటీ... ఇద్దరు లేదా ముగ్గురి పేర్లు సిఫారసు

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ని సిఫారసు చేసేందుకు గాను కాంగ్రెస్‌ పార్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 9 మంది సీనియర్‌ ఎమ్మెల్యేలతో దీన్ని ఏర్పాటు చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, పొదెం వీరయ్య, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్యలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, ఈ నెల 25న వారు సమావేశమై ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని సిఫారసు చేస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ కమిటీ ఎమ్మెల్సీ ఆశావహుల పేర్లను పరిశీలించిన అనంతరం 2 లేదా 3 పేర్లను ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సిఫారసు చేస్తుందని పార్టీ నేతలంటున్నారు. ఈనెల 26న జరగనున్న ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో ఈ పేర్లను పరిశీలించి అధిష్టానానికి ప్రతిపాదిస్తారని, ఆమోదం వచ్చాక ఈనెల 27 లేదా 28 తేదీల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేస్తారని సమాచారం. 

టీపీసీసీ కోశాధికారి గూడూరుకు చాన్సిస్తారా?
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కాంగ్రెస్‌ పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు రిటైర్‌ అవుతున్న షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో పాటు మాజీ మంత్రి మర్రిశశిధర్‌రెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. షబ్బీర్, పొంగులేటిలకు ఇప్పటికే రెండుసార్లు అధిష్టానం అవకాశమిచ్చింది. దీంతో పాటు ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇచ్చినా మరొకరిని విస్మరించారనే అభిప్రాయం వస్తుంది. అధిష్టానం కూడా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నందున ఈ ఇద్దరినీ పక్కనపెట్టినట్టేననే చర్చ జరుగుతోంది. మర్రి శశిధర్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీగా పనిచేయాలనే ఆలోచనలో ఉన్నా గతంలో ఆయన నిర్వహించిన పదవులను బట్టి ఎమ్మెల్సీగా ఆయన్ను ఎంపిక చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. యూపీఏ హయాంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ వైస్‌ చైర్మన్‌గా కేంద్ర మంత్రి హోదాలో పనిచేసిన ఆయన్ను ఎమ్మెల్సీకి పరిమితం చేయడం మంచిది కాదనే భావనలో పార్టీ వర్గాలున్నట్టు సమాచారం.

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారం వస్తే శశిధర్‌రెడ్డిని జాతీయ స్థాయిలో ఉపయోగించుకో వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోం ది. జాతీయ స్థాయిలో ఏదైనా పెద్ద హోదా లేదంటే ఏదైనా రాష్ట్రం నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపుతారని సమాచారం. దీంతో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఏపీలో పార్టీ కోశాధికారులుగా పనిచేసిన చేబ్రోలు హనుమయ్య, సుబ్బిరామిరెడ్డి, విఠల్‌రావు, రాయపాటి సాంబశివరావు, ఆదికేశవులు నాయుడుతో సహా అందరికీ చట్టసభల్లో ప్రాతిని« ద్యం వహించే అవకాశం వచ్చింది. దీంతో ఈసారి టీపీసీసీ కోశాధికారి హోదాలో గూడూరుని ఎంపిక చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నా యి. చాలా కాలంగా పార్టీకి అన్ని విధాలుగా ఉపయోగపడుతున్న గూడూరు పేరును పరి శీలనలోకి తీసుకుందని, స్థానిక నేతలతో ఉన్న సత్సంబం ధాలు, గులాం నబీ ఆజాద్, సుశీల్‌కుమార్‌షిండే లాంటి నేతలతో ఉన్న చొరవ కూడా ఆయనకు కలి సి రానుందనే చర్చ జరుగుతోంది. ఇటీవలి అసెం బ్లీ ఎన్నికల్లో కూడా అన్ని విధాలుగా పార్టీ విజయం కోసం శ్రమించి రాహుల్‌ దృష్టిలో పడిన గూడూరు ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top