ఎంత చెల్లించి మా ఎమ్మెల్యేలను కొన్నారు: ఉత్తమ్‌

Congress MlAs Protest At Assembly Against KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌ గూటికి చేరిన ఎమ్మెల్యేపై అనర్హత వేటువేయ్యాలని టీపీసీపీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారని ఉత్తమ్‌ ఆరోపించారు. మండలి ఎన్నికల ముందు ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోని తీసుకోవడాన్ని నిరశిస్తూ అసెంబ్లీ ముందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జిలతో నిరసనకు దిగారు. (సీఎల్పీ భేటీకి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా..)

ఈ సందర్భంగా ఉత్తమ్‌​ మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన శాసనసభ్యులను ఎంత డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారని ప్రశ్నించారు. కేసీఆర్‌ రెండోసారి సీఎం అయ్యాక అయినా రాజనీతి ప్రకారం వ్యవహరిస్తారని అనుకున్నామని, కానీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన రేగా కాంతారావు, సక్కు దిష్టిబొమ్మలకు దగ్ధం చేస్తామని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top