పోడుభూముల సమస్యపై సీఎం ఎందుకు మాట్లాడరు

Congress MLA Sridhar Babu Slam On CM KCR About Sirpur Kagaznagar Attack - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ మహిళా అటవీ అధికారిణిపై జరిగిన దాడిని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు సరిగాలేదని మండిపడ్డారు. గిరిజనుల పోడుభూముల సమస్య పరిష్కారిస్తామన్న సీఎం కేసీఆర్‌ ఎందుకు నోరు మెదపటం లేదని ఆయన ప్రశ్నించారు. సీఎం గిరిజనులకు పోడు భూములు ఇవ్వమంటుంటే.. అధికారులేమో వాటిని లాక్కుంటామంటున్నారు, ఇదెక్కడి న్యాయమంటూ దుయ్యబట్టారు. పోలీసుల దాడులతో గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటును గమనించి.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మేల్కోవాలని సూచించారు. పోడుభూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ.. పోరాడతామన్నారు. అటవీ అధికారులపై టీఆర్‌ఎస్‌ నేతలు దాడి చేశారని, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top