ప్రజాగర్జనకు తరలిన కాంగ్రెస్‌ నాయకులు | Congress leaders who have been massacred | Sakshi
Sakshi News home page

ప్రజాగర్జనకు తరలిన కాంగ్రెస్‌ నాయకులు

Jun 2 2017 1:26 AM | Updated on Mar 18 2019 8:51 PM

కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన చలో సంగారెడ్డి ప్రజాగర్జనకు నార్నూర్, గాదిగూడ మండలాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు గురువారం భారీగా తరలివెళ్లారు.

నార్నూర్‌: కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన చలో సంగారెడ్డి ప్రజాగర్జనకు నార్నూర్, గాదిగూడ మండలాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు గురువారం భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చౌహాన్‌ డిగాంబర్, సత్తార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరిస్తోందని వివరించారు. మిషన్‌ కాకతీయ పేరుతో చెరువుల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రెండు మండలాల నుంచి మొత్తం 15 వాహనాల్లో కార్యకర్తలు తరలివెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గోవింద్, రాథోడ్‌ రమేశ్, కైలాష్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement