వైరా టికెట్‌ ఇప్పిస్తానని చెప్పి.. | Congress Leader Renuka Chowdhury Cheated Us Says Ramji Naik Wife | Sakshi
Sakshi News home page

వైరా టికెట్‌ ఇప్పిస్తానని చెప్పి..

Aug 3 2018 4:02 PM | Updated on Mar 18 2019 7:55 PM

Congress Leader Renuka Chowdhury Cheated Us Says Ramji Naik Wife - Sakshi

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరి(ఫైల్‌)

ఆమె చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని,  2014లో డాక్టర్‌ రాంజీ నాయక్‌ దగ్గర 1కోటి 30లక్షల రూపాయలు..

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరి టికెట్‌ ఇప్పిస్తానని చెప్పి పలువుర్ని మోసం చేశారని కాంగ్రెస్‌ నేత రవిచంద్ర చౌహాన్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే టికెట్‌ మీకేనంటూ.. ఆమె చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. దీనిలో భాగంగా 2014లో డాక్టర్‌ రాంజీ నాయక్‌ దగ్గర కోటి 30లక్షల రూపాయలు తీసుకున్నారని,  తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు కేసులు పెట్టించారని అన్నారు. 

వైరా టిక్కెట్‌ ఇప్పిస్తానని చెప్పి..

రేణుకా చౌదరి వైరా టికెట్‌ ఇప్పిస్తానని చెప్పి తమ వద్ద కోటి 30లక్షలు రూపాయలు తీసుకున్నారని రాంజీ నాయక్‌ భార్య కళావతి ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా రేణుకా చౌదరిని డబ్బులు అడుగుతున్నాపట్టించుకోవటం లేదని వాపోయారు.  ఈ నెల 14వ తేదీన తెలంగాణ పర‍్యటనకు రానున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలుస్తానని అన్నారు. అలా కుదరకపోతే ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తానన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement