
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి గురువారం అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆయన అక్కడే స్పల్వ అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. హుటాహుటిన ఆయనకు హాస్పిటల్‌కు తరిలించారు. లంగ్స్ ఇన్ఫెక్షన్‌తో జానారెడ్డి బాధపడుతున్నట్టు సమాచారం. డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.