'కాపలా కుక్కలా ఉంటానన్నావ్‌.. ఏమైంది?' | congress leader jagga reddy slams cm kcr | Sakshi
Sakshi News home page

'కాపలా కుక్కలా ఉంటానన్నావ్‌.. ఏమైంది?'

Jun 2 2017 1:40 PM | Updated on Aug 14 2018 11:02 AM

తెలంగాణ ఏర్పడిన తర్వాత కాపలా కుక్కలా ఉంటానన్న టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ తర్వాత సీఎం ఎందుకు అయ్యారని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు.

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పడిన తర్వాత కాపలా కుక్కలా ఉంటానన్న టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ తర్వాత సీఎం ఎందుకు అయ్యారని కాంగ్రెస్‌ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని పదవిని వద్దన్న చరిత్ర గాంధీ కుటుంబానిదన్నారు. కేటీఆర్ నీ బతుకెంత, నీ స్థాయి ఏంటీ అని ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేటీఆర్ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. కేటీఆర్‌ అవినీతి సంపాదన బయట పెడతామని తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఓట్లేసిన జనమే త్వరలో తరిమి కొడతారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement