మాట్లాడే అవకాశం  ఇవ్వట్లేదు: జగ్గారెడ్డి | Congress Leader Jagga Reddy Fires on Etela Rajender | Sakshi
Sakshi News home page

మాట్లాడే అవకాశం  ఇవ్వట్లేదు: జగ్గారెడ్డి

Sep 16 2019 2:52 AM | Updated on Sep 16 2019 4:48 AM

Congress Leader Jagga Reddy Fires on Etela Rajender - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంగారెడ్డి విష జ్వరాలతో తల్లడిల్లుతోందని, సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడదామంటే స్పీకర్‌ అవకాశం ఇవ్వట్లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆదివారం అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ వెయ్యి మంది ఔట్‌పేషెంట్లతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి కిటకిటలాడుతోందన్నారు. మంత్రి ఈటల ఒకసారి సంగారెడ్డికి వస్తే పరిస్థితి తీవ్రత తెలుస్తుందన్నారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఇచ్చి కాంగ్రెస్‌ సభ్యులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement