నగర చుట్టుపక్కన విలువైన భూములు కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు.
భూ కుంభకోణంపై కేసీఆర్ స్పందించాలి: కాంగ్రెస్
Jun 10 2017 1:29 PM | Updated on Mar 18 2019 9:02 PM
హైదరాబాద్: నగర చుట్టుపక్కన విలువైన భూములు కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు. ఆయన శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భూ కుంభకోణం పై దిగ్విజయ్ సింగ్ సీబీఐ విచారణకు డిమాండ్ చేసినా సీఎం స్పందించడం లేదు. ఇప్పుడు తాజాగా కేశవరావు, ఆయన కుమార్తె, నమస్తే తెలంగాణ దామోదర్ రావు, సీఎం పేషీ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికైన సీఎం స్పందించి వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి. తెలంగాణ సర్కార్ దున్నపోతులా తయారైందని రైతులు సచివాలయంలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. మరో నేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు అమ్ముకున్న ధాన్యానికి కనీసం డబ్బులు చెల్లించలేకపోయారు. వచ్చిన కొన్ని డబ్బులు కూడా బ్యాంకర్స్ విడతల వారిగా ఇస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి వెంటనే రైతులను పట్టించుకోవాలన్నారు.
Advertisement
Advertisement