సంతోష్‌ బాబు విద్యాభ్యాసం లక్సెట్టిపేటలోనే ప్రారంభం

Colonel Santosh Babu School Studies in Luxettipet mancherial - Sakshi

ఎస్‌బీహెచ్‌ మేనేజర్‌గా బదిలీపై వచ్చిన సంతోష్‌ తండ్రి

శ్రీసరస్వతి శిశుమందిర్‌లో చదువుకున్న వైనం

ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు ఇక్కడే

లక్సెట్టిపేట(మంచిర్యాల): వీరమరణం పొందిన జవాన్‌ లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ సంతోష్‌బాబు విద్యాబ్యాసం జిల్లాలోని లక్సెట్టిపేటలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో ప్రారంభమైంది. ఆయ న తండ్రి ఉపేందర్‌ స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌లో బ్రాంచ్‌లో మేనేజర్‌గా 1988లో ఇక్కడకు బదిలీపై వచ్చారు. సంతోష్‌బాబును స్థానిక శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. నాలుగో తరగతి వరకు ఇక్కడే చదువుకుని ఐదవ తరగతిలో కోరుకొండ సైనిక్‌ పాఠశాల ప్రవేశపరీక్షలో అర్హత సాధించగా విజయనగరంలోని సైనిక్‌ పాఠశాలలో చేరారు. ఉపేందర్‌కు బదిలీ కావడంతో ఆయన కుటుంబసభ్యులు కూడా ఇక్కడినుంచి విజయనగరం వెళ్లిపోయారు.

మరిపోలేని చిన్ననాటి స్నేహితులు
సంతోష్‌బాబు మరణాన్ని అతడి స్నేహితులు తట్టుకోలేకపోతున్నారు. అప్పటి పాఠశాల ఆచార్యులు రామన్న సంతోష్‌బాబును గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో చిన్నప్పుడు తీయించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఉన్నత హోదాలో ఉండి దేశరక్షణ కోసం ఆయన చేసిన త్యాగం మరువలేనిదన్నారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top