
సంగారెడ్డి : కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గురువారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి సంగారెడ్డి పట్టణంలో బుల్లెట్‌పై తిరుగుతూ వివిధ ప్రాంతాలను పరిశీలించారు. పోతిరెడ్డి పల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. కారులో తిరగాల్సిన కలెక్టర్ సాధారణ వ్యక్తిలా బుల్లెట్‌పై తిరగడాన్ని పట్టణ ప్రజలు ఆసక్తిగా చూశారు.