
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ రొనాల్డ్‌రోస్
మహబూబ్‌నగర్ న్యూటౌన్: తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మామిడి ఉత్పత్తులపై సర్వే నిర్వహించి అంచనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మామిడి అధికంగా ఉత్పత్తి అయ్యే బాలానగర్, రాజాపూర్, నవాబ్‌పేట, దామరగిద్ద, కోస్గి, గండీడ్ మండలాల్లో రైతులకు వచ్చే ఆదాయం, ఉత్పత్తులు వంటి వివరాలతో నివేదికను గురువారం లోగా సమర్పించాలన్నారు. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి మామిడి ఉత్పత్తులను అమ్మితే మంచి ధరలు వచ్చే అవకాశముందని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ ఆనంద్‌కుమార్, ఉద్యానవన శాఖ అధికారి సరోజినిదేవి, డీపీఎం నాగమల్లిక పాల్గొన్నారు.