వైద్యాధికారి మంజులపై కలెక్టర్‌ ఆగ్రహం

Collector Angry On Medical officer  - Sakshi

మంగపేటలో ‘కంటి వెలుగు’ నిర్వహణ పరిశీలన

మంగపేట జయశంకర్‌ జిల్లా : కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ గురువారం మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంప్‌ను మధ్యాహ్నం 12 గంటలకు తనిఖీ చేశారు. టీమ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ మంజుల విధులకు హాజరుకాక పోవడంతో ఆమె ఎక్కడున్నారో తెలుసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించగా ఆయన మెడికల్‌ ఆఫీసర్‌కు ఫోన్‌కలిపి ఇచ్చారు. ‘క్యాంప్‌కు ఎందు కు హాజరు కాలేదు.. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమ నిర్వాహణపై ఇంత నిర్లక్షమా.. అంటూ కలెక్టర్‌ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మార్గమధ్యలో గోవిందరావుపేటలో ఉన్నా ని మంజుల చెప్పగా.. గంటసేపల్లో విధులకు హాజరు కావాలి.. లేదంటే టర్మినేట్‌ చేస్తానని.. తీవ్ర స్థాయిలో మందలించారు.

క్యాంప్‌ వద్ద 10 మంది వరకు మాత్రమే ఉండటంతో రోజువారీ టార్గెట్‌ ఎంత, ఇప్పటివరకు ఎంత మందికి పరీక్షలు నిర్వహించారని కలెక్టర్‌ సిబ్బందిని ప్రశ్నిం చారు. రోజుకు 250 మది టార్గెట్‌ కాగా బుధవారం 28 మంది, గురువారం 17 మందికి పరీక్షలు నిర్వహించామని చెప్పగా ఇదేమిటని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగపేట పీహెచ్‌సీ వైద్యాధికారి మృదులను పిలిపించి కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించి ప్రతి రోజు టార్గెట్‌ పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. అంతకు ముం దు అకినేపల్లిమల్లారం పాఠశాలను సందర్శించడానికి వెళ్లిన క్రమంలో కలెక్టర్‌ కారు బురదలో దిగబడడంతో కొంతదూరం కాలినడకన వెళ్లారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top