కోడిపుంజు గుడ్డు పెట్టింది!

Cock layed egg - Sakshi

సంగారెడ్డి, కల్హేర్‌ (నారాయణఖేడ్‌): కోడిపెట్ట గుడ్డు పెట్టడం అందరికీ తెలిసిందే.. కానీ సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం ఫత్తేపూర్‌లో గురువారం వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లుగొండ తన ఇంట్లో పెంచుతున్న నాటు కోడిపుంజును ఎప్పటిలాగే బుధవారం రాత్రి గంప కింద ఉంచాడు.

గురువారం ఉదయం లేచి చూసే సరికి గుడ్డుపెట్టి కనిపించింది. విషయం కాస్తా ఆనోటా..ఈనోటా.. తెలియడంతో ఈ వింతను చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున మల్లుగొండ ఇంటికి చేరుకున్నారు. అటు సామాజిక మాధ్యమాల్లోనూ ఇది చర్చనీయాంశమైంది. జన్యులోపంతో ఇలా జరిగి ఉండవచ్చని మండల పశువైద్యాధికారి సయ్యద్‌ ముస్తాక్‌ తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top